ఐపీఎల్ 19వ సీజన్‌కు వేళైంది. అసలు సిసలు టీ20 మజాను అందించేందుకు పది జట్లు సై అంటున్నాయి. ఇవాళ బెంగళూరు-సన్‌రైజర్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభం కాబోతోంది. పదేళ్ల ముందు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్, రెండో కప్పు గెలవాలని పట్టుదలతో ఉండగా.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ, ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది. రికార్డు స్థాయిలో అయిదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్.. ఒకప్పటి ఆధిపత్యాన్ని చూపించాలని, తమ టైటిళ్ల ఖజానాకు మరో ట్రోఫీని జత చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. రహానె నేతృత్వంలోని కోల్‌కతా గత ఏడాది పేలవ ప్రదర్శనను అధిగమించి, నాలుగో టైటిల్‌పై గురి పెట్టింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వంలో పుంజుకోవాలని రాజస్థాన్ రాయల్స్ చూస్తోంది. నిరుడు జట్టు రాతను మార్చి ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి తమకు తొలి కప్పు అందిస్తాడని పంజాబ్ ఆశిస్తోంది. అక్షర్ సారథ్యంలోని దిల్లీ, పంత్ నాయకత్వంలోనిని లఖ్‌నవూ జట్లు కూడా ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలన్న ఆశతో ఉన్నాయి. లీగ్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే టైటిల్ నెగ్గి.. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్.. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మరోసారి మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ నేపథ్యంలో వారికి సంతాప సూచకంగా ఈసారి ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని నిర్వహించట్లేదు.
ఐపీఎల్ 19వ సీజన్‌కు వేళైంది..
121





Total views : 47734