Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home International హర్మూజ్ దాటాలంటే ఒక్కో నౌకకి రూ.18కోట్ల ఛార్జ్ ..

హర్మూజ్ దాటాలంటే ఒక్కో నౌకకి రూ.18కోట్ల ఛార్జ్ ..

by CVR NEWS

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వేదికగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ వార్‌ను తలపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అల్టిమేటం.. మరోవైపు ఇరాన్ విధిస్తున్న భారీ జరిమానాలు.. ఆంక్షల మధ్య ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్.. తాజాగా ఒక వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. వాణిజ్య నౌకలకు ప్రయాణ అనుమతులు ఇస్తామని ఇరాన్ వెల్లడించింది. ఇది అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ అనుమతి ఉచితమేమీ కాదు. ఈ మార్గాన్ని వినియోగించుకునే ప్రతి నౌకపై దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.18 కోట్లు) భారీ ఫీజును ఇరాన్ విధిస్తోంది.
యుద్ధం కారణంగా పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడానికే ఈ ‘ట్రాన్సిట్ ఫీజు’ వసూలు చేస్తున్నామని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు.. ఈ జలసంధిపై తమకు ఉన్న సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బలమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

007291
Total views : 47786

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.