Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News ఇరాన్ షాకింగ్ నిర్ణయం…

ఇరాన్ షాకింగ్ నిర్ణయం…

by CVR NEWS

ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ వదులుకోవడం లేదు. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.. యుద్ధానికి ముందు ఉన్నట్లుగా ఈ జలసంధిపై స్వేచ్ఛా రవాణా ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పాయి. ప్రతి నౌక ఇరాన్ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి. అంతేకాదు ఈ రవాణా నియంత్రణ కూడా ఇరాన్ సాయుధ బలగాలైన ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్’ IRGC పర్యవేక్షణలోనే ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఇకనుంచి నౌకలు హర్మూజ్‌ను దాటాలంటే IRGC విధించే ప్రత్యేక రూల్స్‌ను పాటించడం, అలాగే టోల్ చెల్లించాల్సి ఉంటుందనే సంకేతాలిచ్చింది. ఇక నౌకల రాకపోకలకు సంబంధించి ఆయా దేశాలతో IRGC నేరుగా అధికారిక చర్చలు జరుపుతుందని తెలిపింది. తమ పర్మిషన్ లేకుండా ఏ నౌక కూడా జలసంధిని దాటేందుకు వీల్లేదని కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఆంక్షల వెనుక ఇరాన్ తన ఆర్థిక ప్రయోజనాలను కూడా లింక్ చేసింది. యుద్ధం వల్ల వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను ఈ రెండు వారాల కాల్పుల విరమణ గడువులోగా తమకు అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి తాత్కాలికంగా కాల్పుల విరమణ కుదిరినా కూడా చమురు రవాణా, ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisements

You may also like

Our Visitor

014996
Total views : 81453

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.