Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home International ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు

by CVR NEWS
iran-speaker

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. వారితో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో పాటు తమ నౌకల రాకపోకలపై దిగ్బంధనం విధించడంతో.. ట్రంప్‌ దౌత్య సంబంధాలను దెబ్బతీశారని ఆరోపించారు ఘాలిబఫ్‌. టెహ్రాన్‌ లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు, యుద్ధం తిరిగి ప్రారంభించడానికి ఈ చర్చలను ఓ సాకుగా చూపేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఇరాన్‌ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టంచేశారు. గత రెండు వారాలుగా యుద్ధంలో సరికొత్త వ్యూహాల అమలుకు ఇరాన్‌ ప్రణాళికలు రచిస్తోందని ఆయన హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

014997
Total views : 81457

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.