Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home International సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి..!

సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి..!

by Satya
Israeli air attack on Syria


సిరియా(Syria)పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. 44 మంది మృతి

హమాస్‌(Hamas)తో యుద్ధం కొనసాగిస్తున్న వేళ సిరియాపై ఇజ్రాయెల్‌(Israel) వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశ అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని తెలిపింది.

ఇరాన్​ మద్దతు గ్రూపులే టార్గెట్..

అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌తో పాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని పేర్కొంది. ఈ దాడిలో మరణించిన వారిలో 36 మంది సిరియా సైనికులు ఉండగా, ఏడుగురు హెజ్​బొల్లా సభ్యుడు, సిరియా పౌరుడు ఉన్నారని తెలిపింది.

వైమానిక దాడిలో ఇద్దరు పౌరులు మృతి..

సిరియాపై తాజా దాడుల గురించి ఇజ్రాయెల్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కొన్ని గంటల ముందే సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ వైమానిక దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. హెజ్‌బొల్లా సహా ఇరాన్‌ మద్దతుగల సాయుధ బృందాలకు కీలక స్థావరమైన సయిదా జైనాబ్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అబ్జర్వేటరీ వెల్లడించింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: నేరాన్ని అంగీకరించిన మాస్కో ఉగ్రదాడి ముష్కరులు


భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య …
పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి …
అమెరికా-ఇరాన్‌ మధ్య చర్యలు విఫలం కావడంపై ఆందోళన..
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

005709
Total views : 38445

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.