Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home National జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా

జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా

by Satya
జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా

జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణకు అందించారు. హేమంత్ సోరెన్, ఇతర నేతలతో కలిసి ఆయన గవర్నర్‌ను కలిశారు. రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం చంపయి సోరెన్ మాట్లాడుతూ… కొన్ని నెలల కిందట సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తమ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నామని, అందుకే ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేశానన్నారు.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జనవరి 31న అరెస్టయ్యారు. ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో చంపయి సోరెన్ రాజీనామా చేశారు. అంతకుముందు, జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై శాసన సభాపక్ష నగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.