కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల. హైకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుతంనివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..మారిపోయింది. గ్రామానికి చెందిన నాయకుడు వెంకటప్పనాయుడు హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2008వ సంవత్సరం మే 17న కప్పట్రాళ్లకు చెందిన వెంకటప్పనాయుడు హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థుల దాడిలో ఆయనతోపాటు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దేవనకొండ మండలం బోదెపాడు వద్ద లారీతో ఢీకొట్టి మరీ హత్య చేశారు.
ఆ వ్యవహారంలో మొత్తం 42 మందిపై హత్య కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత 2014 డిసెంబర్ 10న 21 మందికి నంద్యాల కోర్టు జీవిత ఖైదు విధించింది. వారిలో నలుగురు అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత ఆదోని కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. మరో 9 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 17 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. వారిలో కీలక నిందితులు మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు కూడా ఉన్నారు. దీంతో కప్పట్రాళ్ల గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. విషయాన్ని ముందే ఊహించిన పోలీసులు గ్రామంలో బందోబస్తు పెంచారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 70874