111
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర ప్రారంభమైంది. స్వచ్ఛందంగా జనం పోటెత్తారు.
అడుగడుగునా జననీరాజనం పలికారు.
నీవే మా ఎమ్మెల్యే అంటూ
నినాదాలతో హోరెత్తించారు. ఎల్బీనగర్ మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ, అరటి పళ్ళు అమ్ముతూ, సామాన్య ప్రజల్లో ఒకడిగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ.. హస్తం గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నారు మధు యాష్కీ. పాదయాత్రకు బ్రహ్మాండమైన స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు