మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహరాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 186 పోలింగ్ బూత్‌లు, 29వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 13న నోటిఫికేషన్, 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని రాజీవ్ కుమార్ తెలిపారు. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఉగ్రవాదులకు, ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదులు స్వీకరించడానికి సీ-విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి