ఆంధ్రాలోని నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ(Telangana) జిల్లాల్లోకి భారీ స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అశ్వారావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీ కి చెందిన బొలెరో వాహనంలో 165 బ్యాగుల్లో 359 కిలోల గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి 11 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనసకాయలు రవాణా నెపంతో భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న 359 కేజీల గంజాయి విలువ సుమారు 89 లక్షల 83 వేలు ఉంటుందని అంచనా. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఎస్సై తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
- హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో మైనింగ్ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది.హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో మైనింగ్ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. బూబకాసురులు ఏకంగా మైసమ్మగుట్టను పిండి చేస్తున్నారు. 130 ఎకరాల వెంచర్లో 27 ఎకరాలకు బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకొని పగలు రాత్రీ తేడాలేకుండా పేళుల్లకు పాల్పడుతున్నారు.బ్లాస్టింగ్ లతో ఇబ్బందులు పడుతున్నారు మైసమ్మ…
- తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లాదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.