చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు (Matsyarasa Visveswara Raju) వారపు సంతలో జోరుగా ప్రచారం చేశారు. మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి విశ్వేశ్వర రాజు తో పాటు ప్రచారం లో పాల్గొన్నారు. విశ్వేశ్వర రాజు వారపు సంతలో ప్రచారం నిర్వహిస్తూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రచారం చేసి ప్రజలకు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునీ మరెన్నో సంక్షేమ పథకాలు పొందాలని అవ్వ తాతలకు అన్నతమ్ములకు అక్క చెల్లెమ్మలు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కోరభూ అనుష దేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, jCS మండల కన్వీనర్ పాంగి గణబాబు, ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, మండలం వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు,సీనియర్ నాయకులు, నాయకులు మండల సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 47706