110
మేడ్చల్ జిల్లా లో అక్రమ నిర్మాణాలపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అనుమతి లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను జిహెచ్ఎంసి అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు. జీ ప్లస్ టూ అనుమతులు తీసుకుని అదనపు అంతస్తులు నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ముందుగా నోటీసులు ఇచ్చి, భవనాన్ని సీజ్ చేసినప్పటికీ మళ్లీ నిర్మాణం చేపట్టడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.




Total views : 47798