విశాఖ గాజువాకలోని LV నగర్‌లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో నేవీ ఉద్యోగి. ఆమెను చంపేసి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో జరిగింది ఈ ఘటన. ప్రియురాలిని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర.
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర..నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ విశాఖలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నాడు. అతని భార్య నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. రవీంద్రకు విశాఖకే చెందిన మౌనికతో గతంలోనే పరిచయం ఉంది. ఆమెను ఇంటికి పిలిచి, అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు అతడిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. ఐతే తనను ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Total views : 78931