దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 15 వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోకి వచ్చే అన్ని ప్రధాన ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెంచడంతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అల్లర్లు, ఉగ్రవాద దాడులు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కేంద్ర, రాష్ట్ర భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్.
252
previous post