దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేస్తే దక్షిణ భారత రాష్ట్రాల్లో నీటి కొరతను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడులో సాగునీటి విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని తన లేఖలో వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ బహుళ రాష్ట్రాల ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం విజయ్ కోరారు.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.
293
previous post