Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home National న్యాయవ్యవస్థపై జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు.

న్యాయవ్యవస్థపై జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు.

by CVR NEWS

న్యాయవ్యవస్థకు నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు అవసరమేనని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ఆరో రామ్‌ జఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షలకు, ప్రశ్నలకు, అవసరమైతే విమర్శలకు కూడా కోర్టులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

‘ప్రజా విశ్వాసం’, ‘ప్రజల ఆమోదం’ రెండూ వేర్వేరు అంశాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ప్రజలకు నచ్చే విధంగా తీర్పులు ఇవ్వడం, పాపులారిటీ సాధించడం ద్వారా న్యాయవ్యవస్థకు చట్టబద్ధత రాదన్నారు. పరీక్షలకు అతీతమని భావిస్తూ న్యాయవ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని పొందలేదని వ్యాఖ్యానించారు.

కేసులు ఓడిపోయిన వ్యక్తులు సైతం న్యాయ ప్రక్రియ నిజాయతీగా జరిగిందని నమ్మినప్పుడే ప్రజా విశ్వాసం ఏర్పడుతుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. న్యాయవ్యవస్థపై నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: