Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Latest News సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

by CVR NEWS

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ‘సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశకు చేరుకుందని మోదీ తెలిపారు. ఇతర దేశాలు ఈ రంగంలో పురోగతి సాధించేందుకు పదేళ్లు తీసుకుంటే.. భారత్‌ కేవలం నాలుగేళ్లలోనే కీలక ముందడుగు వేసిందన్నారు. భారత్‌లో తయారవుతున్న చిప్‌లు త్వరలో ప్రపంచ మార్కెట్లకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. ‘సిలికాన్‌ టు సిస్టమ్స్‌: బిల్డింగ్‌ ది ఈకోసిస్టమ్‌’ థీమ్‌తో ఈ మెగా సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు.

సెమీకండక్టర్‌ రంగంలో చిప్‌ డిజైన్‌కు అవసరమైన నైపుణ్యాలను భారత యువత అభివృద్ధి చేసుకుంటోందని ప్రధాని అన్నారు. యువత దేశ వృద్ధికి మరింతగా సహకరించాలని పిలుపునిచ్చారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీతో లాజిస్టిక్స్‌, తయారీ రంగాలు బలోపేతమవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: