Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News ఢిల్లీలో కొనసాగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్.

ఢిల్లీలో కొనసాగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్.

by CVR NEWS

భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. దేశ ప్రగతిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ సమావేశం కొనసాగుతోంది. “టీమ్ ఇండియా” స్ఫూర్తితో, సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పరమావధిగా.. ఈ ఏడాది సమావేశాన్ని “వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ వికాసం” అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.

ఈ హై ప్రొఫైల్ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

040018
Total views : 202961

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: