కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో 54వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎనిమిది కీలక ప్రతిపాదనలు చేశారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని నిర్వాహకులను మంత్రి ఆహ్వానించారు. పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరతూ పయ్యావుల ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ది చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు. ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని కోరారు. మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. జీవిత, ఆరోగ్య బీమాలపై 15 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహానాల విడి భాగాలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి కుదించాలని కోరారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పైనా జీఎస్టీని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలని మంత్రి పయ్యావుల కోరారు. విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రొత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీని మినహాయించాలని పయ్యావుల ప్రతిపాదనల్లో కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య కొత్త రైలుతెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి..ప్రతి గురు,శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది. ఈ…
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయంత్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి