చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 93 ఏళ్ల వయసున్న ఆయన గత రెండు వారాలుగా చికిత్స పొందారని తెలిపారు. నట్వర్ సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జన్మించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన కె నట్వర్ సింగ్ …మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-05 కాలంలో భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1984లో ఆయనను పద్మభూషణ్ వరించింది. నట్వర్ సింగ్ అనేక పుస్తకాలను కూడా రచించారు. నట్వర్ సింగ్ మృతి పట్ల రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి