వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఖగోళ దృగ్విషయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతమైన రింగ్ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ ఖగోళ దృశ్యం 6 గంటలకు పైగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు
భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని వెల్లడించారు. ఈ ఖగోళ ఘట్టాన్ని వీక్షించాలనుకునే భారతీయ ఔత్సాహికులకు ఈ వార్త నిరాశ కలిగించనుంది.భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. కానీ చంద్రుడి పరిమాణం చిన్నది కావడంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్ని వలయం మాదిరిగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రకాశవంతమైన ఉంగరం ఆకృతి ఏర్పడుతుంది. అందుకే దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య కొత్త రైలుతెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి..ప్రతి గురు,శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది. ఈ…
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయంత్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి