Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home National కేరళలో నిఫా వైరస్ కలకలం

కేరళలో నిఫా వైరస్ కలకలం

by Rama

ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రాణాంతకమైన వైరస్ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
  • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..
    శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో స‌మావేశ‌మైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాలు, నీటి నిల్వలు, విడుద‌ల‌పై అధికారులు చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
  • జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..
    రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
  • సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..
    హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
  • బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్
    బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్   సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

012218
Total views : 74521

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.