Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

by Rama
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 3వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • పూణేలో కూలిన శిక్షణ విమానం..
    మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
  • సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…
    కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
  • విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..
    తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
  • Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..
    Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…
    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్‌ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసులకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

012367
Total views : 74835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.