Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో వర్గ పోరు బయటపడింది…

పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో వర్గ పోరు బయటపడింది…

by CVR NEWS

పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో వర్గ పోరు బయటపడింది. ​పిన్నింటి రామ నాయుడు వలస గ్రామంలో ఎన్టీయార్ విగ్రహావిష్కరణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ​ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వర్గీయుల అడ్డగించటంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. విగ్రహావిష్కరణ కార్యక్రమం నాయకుల మధ్య చిచ్చురేపటంతో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు విగ్రహావిష్కరణ కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎవరికీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదన్నారు. సొంత స్థలంలో విగ్రహం పెడితే అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు. ​శిలాఫలకాన్ని ఎత్తుకెళ్లడం టీడీపీ సంస్కృతి కాదంటూ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య విభేదాలు బయటపడటంతో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisements

You may also like

Our Visitor

012370
Total views : 74845

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.