Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..

by CVR NEWS

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్‌కు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఇద్దరి భేటీలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి వివరాలపై సమీక్షించారు..అలాగే గోదావరి పుష్కరాల నిర్వహణపై కూడా దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు మంత్రి దుర్గేశ్.

2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిపారు. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా ఉత్సవానికి దాదాపు10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. రాజమండ్రితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. భక్తుల కోసం అన్ని ఏర్పా్ట్లు చేసినట్లు వెల్లడించారు.

పుష్కర ఏర్పాట్లపై త్వరలోనే రాజమండ్రిలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర గౌరవం ఇనుమడించేలా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం..ఈ గోదావరి పుష్కరాలను నిర్వహించబోతోందని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014991
Total views : 81441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.