కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహ్మాతా జ్యోతిబాపులే ప్రజా భవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి రెండు రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రజల నుండి మంత్రులు, అధికారులు ఆర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రజా వాణికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజా భవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి పోటెత్తిన జనం..
70
previous post