రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నెరవేర్చందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అయిదేండ్లకు ఆరేండ్లకు పూర్తి కాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అక్కడ నిధులు ఖర్చు చేస్తే లాభం లేదని అన్నారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని సీఎం తెలిపారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు చేయాలని చెప్పారు. ఇక పనులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులు, అవరోధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధానంగా విద్యుత్ విభాగంతో కొన్ని బిల్లుల చెల్లింపుల సమస్యలున్నాయని అధికారులకు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇతర విభాగాలతో సమన్వయం లోపిస్తే పనులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని, వెంటనే ట్రాన్స్‌కో, జెన్కో , డిస్కంలతో ఇరిగేషన్ విభాగం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య కొత్త రైలుతెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి..ప్రతి గురు,శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది. ఈ…
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయంత్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి