Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది.

by CVR NEWS

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్న తరుణంలో, అధికార LDF ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వారు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ అహంకారులని, సీఎం ఏమీ దేవుడు కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. LDF ప్రభుత్వంపై అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై రాహుల్ మండిపడ్డారు. ప్రచారంలో భాగంగా కేరళ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడంతో పాటు, సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు.
వాయనాడ్ ఎంపీ అయిన ప్రియాంక గాంధీ.. కన్నూర్, మలప్పురం, తిరువనంతపురం వంటి కీలక ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. కేరళలో LDF మరియు BJP మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రియాంక ఆరోపించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం పెరిగిపోయాయని, అభివృద్ధి సాధించాలంటే UDF ప్రభుత్వం రావాలని ప్రియాంక గాంధీ ఓటర్లను కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039482
Total views : 197082

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: