కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పడం గమనార్హం. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన రాహుల్.. శ్రీనగర్‌కు చెందిన పలువురు విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంలో పెళ్లి చేసుకోవడంపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందా? అని రాహుల్ వారిని ప్రశ్నించారు. అదే సమయంలో మీ పెళ్లి ఎప్పుడు అంటూ రాహుల్‌నే ఎదురు ప్రశ్న వేశారు. దానికి నవ్వుతూ బదులిచ్చిన ఆయన.. ‘20-30 ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమించా’ అంటూ సమాధానమిచ్చారు. వివాహం గురించి తదుపరి ప్రణాళికలు ఏంటని రాహుల్‌ని ప్రశ్నించగా.మరోసారి పెళ్లి పై స్పందించిన రాహుల్ గాంధీ. ప్రస్తుతానికి అటువంటిదేమీ లేదన్నారు. కానీ,.. వాటిని తోసిపుచ్చలేమని చెప్పారు. దాంతో వివాహానికి మమ్మల్నీ ఆహ్వానించండి అంటూ అక్కడున్న విద్యార్థినులు కోరగా.. తప్పకుండా పిలుస్తానంటూ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
- కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 214665