Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home National పార్లమెంట్లో దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

పార్లమెంట్లో దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

by Satya
పార్లమెంట్లో దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు నిఘా వర్గాలనుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్ నివాసం దగ్గర అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా నిఘా పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఈ క్రమంలో రాహుల్ పై పలు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. రాహుల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో రాహుల్ ఇంటి వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాదు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసులను మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ను కూడా పెంచారు. హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాదు. భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాలని. రాహుల్ గాంధీ నివాసం దగ్గర , ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం.
    విజయవాడను డయేరియా వణికిస్తోంది. గిరిపురంలో వారం రోజులుగా అతిసారం కలకలం రేపుతోంది. చిన్నారులు, పెద్దలు వాంతులు విరోచనాలతో విలవిలలాడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విజయవాడలో డయేరియా ప్రబలటం నిత్యకృత్యమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలం చెందుతున్నారు. నల్లాల్లో అపరిశుభ్రమైన నీరు…
  • మెక్సికోలో భారీ భూకంపం.
    మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
  • షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.
    భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
  • తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.
    తమిళనాడు పెరంబలూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్‌ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
  • కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

041213
Total views : 214683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: