రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినలగచర్ల భూ సేకరణ వ్యవహారంపై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కాసేపటి అధికారులు విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం లగచర్లలో భూ సేకరణ విషయంలో వెనక్కి తగ్గింది. ఫార్మాసిటీ కోసం భూ సేకరణ నోటిఫికేషన్ నిలిపివేస్తూ ప్రకటన జారీ చేసింది. అందువల్ల లగచర్లలో రైతుల పోరాటం ఫలించినట్లే. ఇక వారు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సేకరణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఐతే.. దీనిపై రైతులు, స్థానికులతో మాట్లాడిన తర్వాతే.. సేకరణ చెయ్యనుంది. మొన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా.. దిలావర్‌పూర్, గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడి ప్రజల డిమాండ్‌కి తలొగ్గింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా.. లగచర్ల గ్రామంలో కూడా భూ సేకరణను రద్దు చేసుకుంది. తద్వారా.. అక్కడ ఫార్మాసిటీ ఇక రానట్లే అనుకోవచ్చు. ప్రజల వ్యతిరేకను గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి