Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home Latest News భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన..

భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన..

by CVR NEWS

నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. 45 లక్షల11 వేల 947 మంది రైతులకు రూ.5 వేల 653 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడతగా 3 వేల 590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో, రైతులు రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. ఇవాళ రెండోవిడత రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. కాటారం మండలం నస్రుపల్లిలో నేడు జరిగే రైతు భరోసా భారీ బహిరంగ సభలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ ఏర్పాట్ల ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: