102
బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశా భోంస్లే కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. శనివారం గుండెపోటుతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె.. కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌లో లతా మంగేష్కర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన గాయని ఆశా భోంస్లే. లత చెల్లెలిగా సినీ పరిశ్రమకు పరిచయమైనా అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1933 సెప్టెంబర్ 8 న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. 1943 లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆశా… దాదాపు 60 ఏళ్ల కెరీర్‌లో ఆమె 12 వేలకు పైగా పాటలు పాడారు. ఏడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఆశా… పద్మ విభూషణ్‌తో పాటు దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు సైతం అందుకున్నారు.




Total views : 78931