Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది.

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది.

by CVR NEWS

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి వేళల్లో కర్నూల్ నుంచి పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు అక్రమం గా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. TGMDC విక్రయ కేంద్రం లేకపోవడంతో మూడు నెలల నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక సరఫరా నిలిచిపోయింది. మైనింగ్ శాఖ ‘మన ఇసుక వాహనం’ ద్వారా ట్రాక్టర్లలో సరఫరా సాగుతోంది. వాటి ద్వారా వచ్చే ఇసుక డిమాండ్ ను తీర్చలేకపోతోంది. ప్రస్తుతం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీంతో లబ్ధిదారు లు అప్పులు చేసి పనులను ప్రారంభించినా, అవ సరమైన ఇసుక లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ డబ్బు చెల్లించి బ్రోకర్ల ద్వారా టిప్పర్లలో ఇసుకను తెప్పించుకుంటున్నారు. అదే ఇప్పుడు మాఫియాకు వరంగా మారింది.

అలంపూర్ నియోజకవర్గం లో రాజోలి, తుమ్మిళ్ల, పెద్ద ధన్వాడ, వేణు సోంపురం గ్రామాల నుండి రాత్రి వేళలో అక్రమంగా డాక్టర్లు మరియు మినీ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా కొనసాగుతుంది. ప్రతీరోజు పదుల సంఖ్యలో టిప్పర్ల ఇసుకను విక్రయిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ ఇసుక టిప్పర్లు కర్నూల్ నుంచి ఆలంపూర్, పుల్లూరు, సంకేసుల, నాగులదిన్నెల మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. మరికొందరు దళారులు మంత్రాలయం నుంచి కర్ణాటక సరిహద్దు ద్వారా టిప్పర్ల కు జిల్లాలోకి తీసుకొస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, కొందరు నాయకులు ఇసుక దళారులకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలున్నాయి….

Advertisements

You may also like

Our Visitor

014991
Total views : 81441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.