Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా..

సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా..

by CVR NEWS

సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన, దక్షణ కాశి గా పేరుగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఈవో కార్యాలయం లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అంత్యపుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శాఖల వారీగా హాజరైన ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పిఆర్ ఇంజినీరింగ్, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ఆర్టీసి అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గత సంవత్సరం జరిగిన సరస్వతి పుష్కరాలలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా ఉండాలని ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 540 మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్ లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

007259
Total views : 47727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.