సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే.. అదే సమయంలో ప్రీమియర్ షో చూసేందుకు దిల్ సుఖ్ నగర్ నుంచి రేవతి అనే వివాహిత భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్, శాన్వికలతో సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై 105, 118-1 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకవేళ కోర్టులో నేరం నిరూపితం అయితే అల్లు అర్జున్ కు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 70906