Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

by CVR NEWS
ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం

మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో సంస్కృతీ సంప్రదాయాలతో పాటు తమ చరిత్రను నృత్యకారులు ఘనంగా ప్రదర్శించారు. అంతలోనే వేదిక మధ్యలో నుంచి భారీ ఫిఫా వరల్డ్‌కప్‌ పైకి రావడం ఆకట్టుకుంది. ఇక మెక్సికన్‌ పాప్‌ బ్యాండ్‌ మనా రాకతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత లాస్‌ఏంజిల్స్‌ అజులెస్‌ గ్రూప్‌, కొలంబియా సింగర్‌ జె బల్విన్‌ ప్రదర్శనల తర్వాత చివర్లో ప్రఖ్యాత పాప్‌ గాయని షకీరా స్టేడియంలో ప్రవేశించింది. ఫిఫా అధికారిక గీతమైన ‘డాయి డాయి’ని తను నైజీరియన్‌ బర్నా బాయ్‌తో ఆలపించగా.. ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు. అనంతరం మెక్సికో-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభం కావడంతో ఫిఫా వరల్డ్‌క్‌పకు తెర లేచినట్టయ్యింది.

తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన గ్రూప్-A పోరులో మెక్సికో 2-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది.ఈ మ్యాచ్ చారిత్రాత్మక రికార్డులకు వేదికైంది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వి ఒనెస్ మెక్సికోకు తొలి గోల్ అందించగా, 67వ నిమిషంలో సీనియర్ ఆటగాడు రౌల్ జిమెనెజ్ అద్భుత హెడర్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో గోల్స్ కంటే ‘రెడ్ కార్డ్‌ల’ మోత మార్మోగింది! ఆటగాళ్ల మధ్య ఘర్షణల వల్ల రెఫరీ ఏకంగా 3 రెడ్ కార్డ్‌లు సౌత్ ఆఫ్రికాకు రెండు, మెక్సికోకు ఒకటి ఇచ్చి మైదానం వెలుపలికి పంపారు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా, కాస్త ఘర్షణలతో కూడిన ఓపెనింగ్ మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది.”

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203018

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: