ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) :
నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పదకొండు గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇచ్చారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్‌కతా అలీపూర్‌లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
- మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్..సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మీనాక్షి…
- పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.రష్యాతో భారత్ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…




Total views : 141763