శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని… - గుజరాత్లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని… - పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…







Total views : 74522