రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని 134 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నంద్యాలలో 41 పరీక్ష కేంద్రాలు లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,242 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే లోపలికి విద్యార్థులు పంపినట్లు అధికారులు తెలిపారు. డిఎస్పి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసామని, పరీక్ష కేంద్రాలలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్లు లాంటి వస్తువులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
10th class
పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా ..
పదో తరగతి పరీక్షల(10th class exams)కు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించాలని తెలంగాణా ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి పంపించబోమని స్పష్టం చేసింది. ఈ నెల18 నుంచి పదవ తరగతి పరీక్షలు(10th class exams) ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చివరి నిమిషంలో ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని బోర్డు సూచించింది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్ కోడ్, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్టైతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను సంప్రదించాలని సూచించింది.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో గత బుధవారం 15/11/2023 రోజు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. వివరాల్లోకి వెల్తే: మంగలి ఆకాష్ అనే విద్యార్థి షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు బుధవారం 15/11/2023 పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ సహాయంతో డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఈ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు శ్రమించిన ఫలితం లేకపోయింది ఆ యొక్క క్వారీ లోతు దాదాపు 200 అడుగులు ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు ఈరోజు ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశాయి. తన తల్లిదండ్రులు అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు..
Read Also…
Read Also…




Total views : 74523