ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేలం నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఈ బార్లకు లైసెన్సు గడువు 2025 ఆగస్టు వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు బార్లకు సంబంధించి వేలం నిర్వహించగా, కొన్ని బార్లు మిగిలిపోయాయి. వీటికి వేలం నిర్వహిస్తున్నారు. ఈ బార్లకు సంబంధించి నాన్ రిఫండబుల్ ఫీజు విషయానికి వస్తే .. 50 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు 5లక్షలుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 7.5 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాలలో బార్లకు10 లక్షలుగా ఫీజు నిర్ధారించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
- ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…
- మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ..చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్ లో జరిగిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 69924