హైదరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24).
Follow us on : Facebook, Instagram & YouTube.
జవహర్ నగర్ లోని ఎస్సార్ బాలికల హాస్టల్ లో ఉంటూ గ్రూప్ ఫోర్ (Group 4)కు ప్రిపేర్ అయిన శిరీష. ఇటీవల ప్రకటించిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శిరీష గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చినందుకు ఆత్మహత్య చేసుకుందా లేక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 81457