ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని తెలిపారు. ఒకేసారి 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు.
గతంలో డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. జర్మనీకి చెందిన బాయర్ సంస్థ డయాఫ్రం వాల్ నిర్మించిందని వివరించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ ను మార్చేసి, ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం డ్యామ్ ను గోదాట్లో కలిపేశారని మండిపడ్డారు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ల వంటివని చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలతో కొత్త ఆయకట్టు వస్తుందని తెలిపారు. 23 లక్షల ఎకరాల భూమి స్థిరీకరణ చెందుతుందని పేర్కొన్నారు. పోలవరం ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి