గుంటూరు జిల్లా:…..
తెనాలి నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ – 7,354
వైసిపి అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ – 3520
కూటమి జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ – 3834 ఓట్లు ఆధిక్యత.
ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. వీటికోసం జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామాగ్రి అందించి ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. మొదట 600 పోలింగ్ కేంద్రాలే ఏర్పాటు చేయాలనుకున్నా.. భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను మారుమూల ప్రాంతాల ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. వచ్చే నెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ఎన్నికల కమిషన్ మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు సూచించింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31 లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ https://voters.eci.gov.in
లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యం రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వాల కోసం యువతరం కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల వేళ ఎలక్షన్ కోడ్(Election Code) అమలులో ఉన్న నేపధ్యం లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్(Mukesh Kumar Meena) మీనా మీడియా సమావేశం అయ్యారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత మూడు రోజుల్లో ఎం.సి.సి. ఉల్లంఘనలపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయని, రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఈ నెల 16 వ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్బంగా తీసుకున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయం ఎన్నికల మీడియా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హింస రహిత, రీ పోలింగ్ కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అయితే దురదృష్ట వశాత్తు ఈ మద్య కాలంలో గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇటు వంటి హింసాత్మక సంఘటనలకు దారితీసిన కారణాలను, చట్టపరంగా తీసుకున్న చర్యలను వివరించేందుకు సంబందిత జిల్లాల ఎస్పీలు రేపు తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల(AP Elections) ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని, ఎం.సి.సి. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి రాకముందు నుండే ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుండి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాదాపు రూ.176 కోట్లు విలువైన నగదు, విలువైన లోహాలు, నార్కొటిక్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే రోజులతో పోల్చుకుంటూ మద్యం ఉత్పత్తి, పంపిణీ, నిల్వలను రెగ్యులర్ గా పర్యవేక్షించడం జరుగుచున్నదని, గత ఏడాది ఉన్న సాదారణ ఉత్పత్తి, నిల్వలు కంటే ఈ ఏడాది తక్కువ స్థాయిలో ఉన్నట్లు గమనించడం జరిగిందన్నారు.
అదే విధంగా ఆస్తుల వికృతీకరణ (Defacement) కు సంబందించి 94 కేసులు, వాహనాలు, లౌడ్ స్పీకర్లు దుర్వినియోగంతో పాటు చట్టవిరుద్దమైన సమావేశాలు, ఓటర్లను ప్రేరేపించడానికి సంబందించి 37 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలకు సంబందించి ప్రజా ఆస్తుల పరిధిలో 1.99 లక్షలు మరియు ప్రైవేటు ఆస్తుల పరిధిలోని 1.15 లక్షల వాల్ పెయింటిగ్స్ ను, పోస్టర్లను, బ్యానర్లను మరియు ఇతర వస్తువులను తొలగించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో 144 సెక్షన్(144 section) అమలు అవుతోందని, ఎలాంటి కార్యక్రమానికైన అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. సువిధా యాప్(Suvidha app) ద్వారా అనుమతులు తీసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 392 ధరఖాస్తులు అందాయని, వాటిలో 10 తమ పరిధిలోవి కాగా మిగిలినవి జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఎం.సి.సి. ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న 100 నిముషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకూ 1,307 ఫిర్యాదులు అందాయని, వాటిలో 74 శాతం పరిష్కరించండ జరిగిందన్నారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్ ను విస్త్రత స్థాయిలో అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో సాన్నిహిత్యంగా ఉండటం ఎం.సి.సి. నియమాలకు విరుద్దమన్నారు. ఫిర్యాదులు అందిన 46 మంది వాలంటీర్లను, కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుండి తొలగించామని, కొందరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామాని తెలిపారు.
ఈ నెల 30 తేదీ నుండి జరుగన్ను డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వాయిదా వేయవద్దని మరికొందరు అభ్యర్థులు విస్తృత స్థాయిలో తమ కార్యాలయానికి మెయిల్స్ చేశారన్నారు. ఈ పరీక్షలకు దాదాపు 4.72 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈ అంశానికి సంబందించి విద్యాశాఖ నుండి వచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించటం జరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరేంధ్రప్రసాద్ సి-విజిల్ యాప్ వినియోగం, ఆ యాప్ ద్వారా అందే పిర్యాధులపై తీసుకునే తక్షణ చర్యలను వివరించారు. అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.