ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమయింది. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్దిదారులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీపం పథకం కింద ముందు పూర్తి ధరను చెల్లించిన తర్వాత సిలిండర్ ఖర్చును లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు.
ఏడాదిలో ప్రతీ కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం .. ఈరోజు తొలి సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. లబ్దిదారులు ఈరోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. పొందవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖతో కలిసి లబ్దిదారుల ప్రత్యేక ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు.
గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కుటుంబాలు అర్హులు అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే నిరుపేద కుటుంబాలకు మాత్రం అమలవుతుందా లేక ధనికులకు కూడా అమలు చేస్తారా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
- ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
- తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి…
- తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
- మూసీ సుందరీకరణకు తొలి అడుగు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి