ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సమావేశమైంది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. లోక్ ఎన్నికల తర్వాతే తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని నిన్న చెప్పిన మమత, ఒక్కరోజులోనే స్వరం మార్చేశారు! ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే అంటూ నేటి సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా మమత ప్రతిపాదనకు ఇండియా కూటమిలో 12 పార్టీల నుంచి మద్దతు లభించింది. అంతేకాదు, ఊహించని రీతిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. దేశానికి తొలి దళిత ప్రధానిని అందించేందుకు ఇదొక మంచి అవకాశం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఖర్గే నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో మమతా బెనర్జీ సహా ఇతర విపక్ష నేతలు నిరాశకు గురయ్యారు. మమత ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తోసిపుచ్చారు. తాను అణగారిన వర్గాల కోసం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. మొదట మనం ఎన్నికల్లో గెలవాలి. గెలవడానికి ఏం చేయాలన్నదాని గురించే ఇప్పుడు ఆలోచించాలి. అసలు మనకు ఎంపీలే లేకుండా ప్రధాని పదవి గురించి ఆలోచించడంలో అర్థమేముంది? ముందు మనం ఐకమత్యంతో కృషి చేసి మెజారిటీ పొందాలి” అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.
India
దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా మిస్టర్ 360 గా నిలిచాడు. ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సరసన నిలిచాడు. అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు, మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది. ఇక టీ20 ఫార్మాట్లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3, కోలిన్ మన్రో 3, బాబర్ ఆజం 3 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ 360 గా నిలిచాడు. మాక్స్వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ ఇండియాలో 3, ఇంగ్లండ్‌లో ఒక సెంచరీ కొట్టాడు.
కరోనా మహమ్మారి అంతమైపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కరోనా గురించి చాలా మంది మర్చిపోయారు కూడా. అయితే తాజా పరిణామాలు మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం కేరళలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also..
Read Also..
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. గత జూన్‌లో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నజ్జర్ హత్య వెనుక ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో గత సెప్టెంబర్ నుంచి ఒట్టావోతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. కెనడా ఆరోపణలను నిరాధారమని ఇండియా తోసిపుచ్చింది. ఇరు దేశాలు దౌత్యవైత్యలను తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులకు గత సెప్టెంబర్ 21 నుంచి నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ బుధవారంనాడు పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ మానవతా సాయం అందిస్తుంది. గత నెలలో మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామాగ్రిని పంపిన భారత్, తాజాగా రెండో విడత సాయాన్ని పంపింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్ కి బయలుదేరిందని పోస్ట్ చేశారు. ఈ సామాగ్రిని మొదట ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. ప్రస్తుతం గాజాలోకి మానవతా సాయం కోసం రఫా మాత్రమే క్రాయింగ్ పాయింట్ గా ఉంది. అయితే గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడంతో వివిధ దేశాలు పంపించే మానవతా సాయం అందించే ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడంలేదు.
ఫిఫా వరల్డ్ కప్-2026 కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఆసియా స్థాయిలో జరిగిన ఫిఫా క్వాలిఫయర్స్ లో భారత్ గెలుపు బోణీ కొట్టింది. కువైట్ తో జరిగిన రెండో రౌండ్ పోరులో భారత్ 1-0తో విజయం సాధించింది. భారత్ తరఫున ఏకైక గోల్ ను మన్వీర్ సింగ్ సాధించాడు.
కువైట్ నగరంలోని జబేర్ అల్ అహ్మద్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత్ జోరు ప్రదర్శించింది. క్రొయేషియా సాకర్ దిగ్గజం ఇగోర్ స్టిమాక్ కోచ్ గా వచ్చాక భారత్ ఆటతీరు యూరోపియన్ శైలిలోకి మారింది. వేగవంతమైన పాస్ లు, ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్ కీపర్ ను ఏమార్చే ఎత్తుగడలను భారత ఆటగాళ్లు వంటబట్టించుకున్నారు. ఈ విజయంతో భారత్ కు 3 పాయింట్లు లభించాయి. తొలి అర్ధభాగంలో భారత్, కువైట్ జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే రెండో అర్ధభాగంలో మన్వీర్ సింగ్ గోల్ చేసిన గోల్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపింది. ఈ ఫిఫా క్వాలిఫయింగ్ రౌండ్లలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఖతార్ తో నవంబరు 21న భువనేశ్వర్ లో ఆడనుంది. భారత్ ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్ లో 102వ స్థానంలో ఉంది. ఖతార్ 61వ ర్యాంకు జట్టు. ఖతార్ కు వరల్డ్ కప్ లలో ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తనకంటే మెరుగైన ర్యాంకింగ్, అనుభవం ఉన్న ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరమైన అంశం. అయితే, ఈ మ్యాచ్ సొంతగడ్డపై ఆడనుండడం భారత్ కు కలిసొచ్చే అంశం.
Read Also..
సంభావ్య ప్రభావ ప్రాంతం ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఉంటుందని అంచనా వేయబడిందని, చంద్రయాన్-3 యొక్క చివరి పథం భారతదేశం మీదుగా వెళ్లలేదని ఇస్రో సూచించింది.
ఈ సంవత్సరం జూలై 14న చంద్రయాన్-3 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన LVM3 M4 లాంచ్ వెహికిల్ యొక్క క్రయోజెనిక్ ఎగువ దశ యొక్క అనియంత్రిత రీ-ఎంట్రీని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నివేదించింది.
ఇస్రో తమ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నట్లుగా, సంభావ్య ప్రభావ ప్రాంతం ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఉంటుందని అంచనా వేయబడింది మరియు చివరి పథం భారతదేశాన్ని దాటలేదని సూచించింది.
ఈ రాకెట్ భాగం LVM-3 M4 లాంచ్ వెహికల్లో భాగంగా ఏర్పడింది మరియు దాదాపు 14:42 IST సమయంలో భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది.
ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (IADC) సిఫార్సు చేసిన మార్గదర్శకాల ప్రకారం, తక్కువ-భూమి కక్ష్య వస్తువుల కోసం “25-సంవత్సరాల నియమానికి” పూర్తిగా కట్టుబడి, ప్రయోగించిన 124 రోజులలోపు పునఃప్రవేశం జరిగింది, ISRO ధృవీకరించింది.
చంద్రయాన్-3 ఇంజెక్షన్ తరువాత, ఐక్యరాజ్యసమితి మరియు IADC నిర్దేశించిన అంతరిక్ష శిధిలాల ఉపశమన మార్గదర్శకాలకు కట్టుబడి, మిగిలిన ప్రొపెల్లెంట్ మరియు శక్తి వనరులను తొలగించడానికి ఎగువ దశ “నిష్క్రియ” చేయబడింది.
”అంతర్జాతీయంగా ఆమోదించబడిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీని నిష్క్రియం చేయడం మరియు మిషన్ తర్వాత పారవేయడం బాహ్య అంతరిక్ష కార్యకలాపాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడటానికి భారతదేశం యొక్క నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తుంది” అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై నోరుపారేసుకున్నాడు. భారతదేశంపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ప్రపంచంలోని పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా వ్యవహరించడం తీవ్ర ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. దీనివల్ల మిగతా దేశాలకు ముప్పు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు గుప్పించాడు. కెనడా పౌరుడిని విదేశీ ఏజెంట్లు కెనడా గడ్డమీద హత్య చేయడం తీవ్రమైన విషయమని చెప్పాడు. ఈ హత్య ఇండియన్ ఏజెంట్ల పనేనని ఆషామాషీగా చెప్పడం లేదని, తమ వద్ద సమాచారం ఉందని అన్నాడు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, బాధితుల విచారణకు సహకరించాలని భారత్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే, భారత్ నుంచి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. దీంతో ఈ అంశాన్ని అమెరికా సహా మిత్ర దేశాల దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రూడో వివరించారు.
ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది. తూర్పు జెరూసెలం, సీరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది. మొత్తం 145 సభ్యల దేశాలు గురువారం ఈ తీర్మానాన్ని ఆమోదించగా 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కెనడా, హంగరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేషన్ ఆఫ్ మైక్రోనేసియా, నౌరూ, అమెరికా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. కాగా, ఇజ్రాయెల్ తీరును ఐక్యరాజ్య సమితిలో భారత్ ఖండించడాన్ని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే స్వాగతించారు. ఐరాసా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. తీర్మానం ఫొటో కూడా ఆయన నెట్టింట పంచుకున్నారు. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. గతనెలలో ఐక్యరాజ్యసమితిలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ భారత్ దూరంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోరుతూ జోర్డాన్ ఈ రిసొల్యూషన్‌ను యూఎస్ ముందుంచింది. అయితే, ఈ తీర్మానంలో ఉగ్రసంస్థ హమాస్ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ తీర్మానానికి 145 దేశాలు అనుకూలంగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలో సిల్క్యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు.
దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్ ఇన్నింగ్స్. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్ ఇచ్చారు.