వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈసీ మహేశ్వర్ రెడ్డి నీటి పన్ను చెల్లించేందుకు తహసీల్దార్ ఆఫీస్‌కి గురువారం వెళ్లారు. అయితే, అక్కడ ఆయనను కొందరు వ్యక్తులు అడ్డుకుని సంబంధిత పత్రాలను చించివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి వేముల పీఎస్‌కి వెళ్లి ఎస్ఐతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడికి భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమ వాహనంలోనే పులివెందులలోని జగన్ క్యాంపు ఆఫీస్‌కి తరలించారు. అక్కడే సీఐ నరసింహులు ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 70926