తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో విచారణను వేగవంతం చేశారు సీఐడీ పోలీసులు. ట్రీట్ మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పటళ్లపై సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు. గ్రేటర్ హైదరాబాద్ లో 10 హాస్పటళ్లు, ఖమ్మం లో 10, నల్గొండ 4, కరీంనగర్ 2, వరంగల్ 1, మహబూబాబాద్ 2, హాస్పటళ్లపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేషెంట్లు లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే బోగస్ బిల్లులతో ఆస్పత్రులు లక్షల్లో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టాయి ఆస్పత్రులు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 81448