డోన్ సొంత నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గనకు…. భారీ షాక్ ఇచ్చిన డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి.
డోన్ నియోజవర్గంలో డోన్, ప్యాపిలి లో వైసీపీ నుండి టిడిపిలోకి భారీ వలసలుచేరారు. డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సమక్షంలో డోన్ మండల రామదుర్గంలో 60 కుంటూ బాలు వైసీపీ నుండి టీడీపీ లో చేరారు. అనంతరం ప్యాపిలి మండలం ఆర్థిక మంత్రి బుగ్గన వైసిపి ముఖ్యమైన నాయకుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల పల్లెలో 100 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల. జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆహ్వానించారు. వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకుప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తాను అని ఎల్లవేళలా మీకు అందుబాటులో నియోజవర్గంలోనే ప్రతినిత్యం ఉంటానని హామీ ఇచ్చారు.
kurnool district news
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పదోవరోజైన ఈ రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన ,త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ మాడ వీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ సమావేశం రసాభాస గా సాగింది. ముందుగా మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మున్సిపల్ నిధులపై టిడిపి కౌన్సిలర్ దయసాగర్, వైసిపి కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ మధ్య మాటల యుద్ధం సాగింది. టీడీపీ కౌన్సిలర్ దయసాగర్ మాట్లాడుతూ మున్సిపల్ నిధుల్లో నాలుగు కోట్లు నిధులు ఉండగ వాటిని ఇష్టానుసారంగా వాడడంతో ప్రస్తుతం నిధులు లేకపోగా మున్సిపల్ స్టేషనరీ, వాటర్ క్యాన్లు కొనే పరిస్థితిలో కూడా మున్సిపాలిటీ లేకపోవడం దారుణం అన్నారు. ఆ నిధులన్ని ఎక్కడికి వెళ్లాయి అంటూ మున్సిపల్ కమిషనర్ ను అడగగా దానికి వైస్ చైర్మన్ నజీరామత్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలను సాగాయి దీంతో మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశాన్ని ముగించారు. దింతో కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి టిడిపి కౌన్సిలర్లు మాట్లాడాలని అనుకున్న వైసిపి కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని, వారి వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ సమావేశంలోనే నేలపై బైఠాయించి అజెండా కాపీలను చింపుతూ టీడీపీ కౌన్సిలర్ లు నిరసన వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగోవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి మయురావాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయురావాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా రాజగోపురం నుండి మయురావాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు మయురావాహానంపై శ్రీస్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, చైర్మన్ చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి డోన్ ఆత్మీయ 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు కూడా అదే విధంగా ఆలూరు వీరభద్ర గౌడ్ మంత్రాలయం తుక్కారెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. ఈ ఆత్మీయ సమావేశానికి అమ్మ హోటల్ దగ్గర నుంచి పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. కోట్లను భారీ జనాలతో కార్యకర్తలు, నాయకులు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కోట్ల మాట్లాడుతూ
డోన్ అభివృద్ధి చేసింది కోట్ల, కె ఈ కుటుంబాలు తప్ప ఇంకా ఎవరూ లేరన్నారు. డోన్ లో విద్య వైద్యం అంటే కోట్ల, కే ఈ కుటుంబాలే గుర్తొస్తారు. డోన్ పట్టణంలో ప్రజలకు దాహం తీర్చడానికి గాజులు దిన్న ప్రాజెక్టు నీటి వసతి, ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఇలా ఎన్నో అభివృద్ధి చేశామని కోట్ల తెలిపారు. బుగ్గన బెదిరింపు రాజకీయాలు చేస్తే సహించ లేదు అంటూ కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి విమర్శలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సబబు కాదన్నారు. ప్యాపిలి పోలీసు వాళ్ళు బుగ్గన ఆదేశాలతో పార్టీలోకి వస్తావా లేదంటే క్రిమినల్ కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరించారని ఆయన అన్నారు. నీ బెదిరింపులకు మా ప్యాపిలి మండలం బాయిపల్లె సర్పంచ్ లింగన్న రాడని కోట్ల బుగ్గన పై విమర్శలు చేశాడు. డోన్ నియోజకవర్గం ప్రతీ కార్యకర్త టిడిపికి సైనికులుగా పని చేయండి నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కోట్ల, మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలి డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన ను చిత్తు చిత్తుగా ఓడించి మనం గెలవాలని కార్యకర్తలకు, నాయకులకు కోట్ల పిలుపునిచ్చారు. కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గం లో ప్రతి టిడిపి కార్యకర్తకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆమె తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు అండగా ఉన్నారని, బుగ్గన నీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకో, నీ బెదిరింపు రాజకీయాలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ రోజు పార్టీలో ప్యాపిలి మండలం గుడిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట రెడ్డి పార్టీలో చేరుతుంటే ఐదు వాహనాలతో బుగ్గన అనుచరులు అడ్డగించి భయభ్రాంతులతో గురి చేశారు. విషయం తెలిసిన వెంటనే వెంకటరెడ్డికి అండగా నిలబడి పార్టీలో చేర్చుకుంటున్నాను. కే ఈ ప్రభాకర్ మాట్లాడుతూ కే ఈ, కోట్ల కుటుంబం టిడిపి నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని కే ఈ ప్రభాకర్ తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి కోట్లు జయ సూర్యప్రకాశ్ రెడ్డి ని అత్యధిక గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో కే ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ డోన్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికులు పని చేసే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కే ఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కు ఎప్పుడు అండగా ఉంటాడు మన కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, కే యి కృష్ణమూర్తి తెలిపారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో స్వామి వారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరించినున్నారు. బ్రహొత్సవాలను పురస్కరించుకుని సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం వారి తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 11వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం 5గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు స్వామికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయి. 9న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 11న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 5 వరకు ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. సాధారణ భక్తులు శ్రీ స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు. తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేయించడానికి ద్విచక్ర వాహనం పై వస్తున్న వరదరాజులును సత్యం నాయుడు మార్గ మధ్యలో స్కార్పియోతో ఢీ కొట్టి.. తుపాకీతో బెదిరించి వరదరాజులు కూతురును కిడ్నాప్‌కు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకున్న వరద రాజులపై దాడి చేసి గాయపరిచాడు.దీంతో పత్తికొండ పోలీసులకు వరదరాజులు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే వరదరాజులు కుమార్తె ఆచూకీ దొరికిందని ప్రసుత్తం యువతి క్షేమంగా ఉందని…కాగా సత్యం నాయుడు పరారీలో ఉన్నట్లు…కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన స్కార్పియోను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి తుపాకిని కూడా స్వాధీనం పరుచుకుంటామన్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర,అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్,కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.
టీడీపీ జనసేన కలిసి నేడు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పేరు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండల టిడిపి కమిటీ సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా డా బి వి జయనాగేశ్వర రెడ్డి ప్రకటించాలని కోరారు. ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా డా బి వి జయనాగేశ్వర రెడ్డిను తప్ప వేరే ఎవ్వరికి కేటాయించిన ఎమ్మిగనూరు మండలంలోని అన్ని గ్రామాలలో గల టిడిపి గ్రామ కమిటీలు, బూత్ ఇంచార్జిలు, మండల కమిటీ సభ్యులు అందరు కూడా టిడిపి పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు.
సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ (SAPNET) గా మాచాని వెంకటేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో బీసీ కోటలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ను ముందుగా మాచాని వెంకటేష్ కు కేటాయించి ఆ తరువాత సర్వేల్లో ఆయనకు వ్యతిరేకత రావడంతో ఆయన్ను తప్పించి బుట్టా రేణుకాకు ఆ భాద్యతలు అప్పగించారు. అయితే మాచాని వెంకటేష్ ను తప్పించే క్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా సోమవారం మాచాని వెంకటేష్ కు సొసైటీ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ పదవి వరించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.






Total views : 74841