సంగారెడ్డి జైలులో ఉంటున్న రైతు హీర్యానాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. అదే సమయంలో రైతుకు బేడీలు వేసి తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. హీర్యానాయక్ బేడీల ఘటనపై వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వచ్చాయని అన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని.. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. హీర్యా నాయక్‌ను కూడా లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదు. బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా చేశారా? లేక పొరపాటున చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. హీర్యా నాయక్‌కు గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. అసలు సురేష్ ఫోన్లో మాట్లాడింది ఎవరితో అనే దానిపై ఆరా తీస్తున్నాం. ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన అందరికీ కఠిన చర్యలు తప్పవు అని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199103